ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ ‌కస్టడీ కోరుతూ పిటిషన్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3: ‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఏడు రోజులపాటు కస్టడీకి కోరారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఉదయ్‌కృష్ణారెడ్డి ఫోన్‌, ‌ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ‌పరీక్షలకు పంపారు. మరో ఇద్దరి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాలో పరిచయమైన మరో యువతికి ఉదయ్‌ ‌పెళ్లి ప్రతిపాదనలు పంపినట్లు గుర్తించారు. ఆ యువతి స్టేట్‌మెంట్‌ను ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్‌పై మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టనుంది. పోలీసు కస్టడీ పిటిషన్‌ ‌రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *