-బాలికపై అత్యాచారం, దారుణ హత్య
గౌహతి, ఆగస్ట్ 3: అస్సాంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, అతి దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే ఆమెను గుర్తించలేని స్థితిలో ఇంట్లో శవమై కనిపించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే తన కజిన్‌తో గొడవ కారణంగా తిరిగి ఇంటికి వచ్చేసింది. వేడుక అనంతరం వారు ఇంటికి వచ్చేసరికి తమ కుమార్తెను ఆ స్థితిలో చూసి హతాశులయ్యారు. హత్య చేయడానికి ముందు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైందని, వ్యక్తిగత అవయవాల్లోకి రాడ్డు చొప్పించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. శవపరీక్ష అనంతరం లైంగికదాడి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని, హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





