నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడతాం

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నర్సంపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ఎంతకాలం బతికాం అనేది కాదు.. ఎలా బతికామనేదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు సిద్దిపేట ఎమ్మెల్యే, మ‌రో నేత‌ హరీశ్ రావుతో కలిసి హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు లక్షకుపైగా తరలి వచ్చారు.. 12 గంటలపాటు వర్షం పడుతున్నా అంతిమయాత్రలో పాల్గొన్నారు.. ఆయన ఎలాంటి వ్యక్తో తెలిపేందుకు ఇదే నిదర్శనం అన్నారు. పెద్ది కోరుకున్నట్లు వచ్చే రెండేండ్లలో అధికారంలోకి వస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామన్నారు. భవిష్యత్ తరాలు గుర్తు చేసుకునే విధంగా ఘన నివాళుల ర్పిద్దామని కేటీఆర్ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *