– బస్సు ప్రమాదం తర్వాత ప్రధాన డ్రైవర్ పరార్
– పోలీసుల అదుపులో స్పేర్ డ్రైవర్
కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామునల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం.రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా- గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 2.బడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ -గాయపడి కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. 3.అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు. 4.సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 5.నెలకుర్తి రమేష్ (36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలయ్యాయి. సురక్షితంగా ఉన్నారు. 6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (8), అభీరా (1.8 సంవత్సరాలు) – ముగ్గురూ సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు. 7.కపర్ అశోక్ (27), తెలంగాణ రాష్ట్రం. సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు. 8.ముసలూరి శ్రీహర్ష (5), నెల్లూరు జిల్లా-గాయపడి కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. 9.పునుపట్టి కీర్తి (28), ఎస్‌ఆర్‌నగర్, హైదరాబాద్, చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ చేరుకున్నారు. 10.వేణుగోపాల్ రెడ్డి (24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. 11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా -చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు. 12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ -ఆకాశ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 13.అశ్విన్ రెడ్డి – ఎలాంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు. 14.ఆకాశ్ -ఎలాంంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు. 15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు. 16.పంకజ్ ప్రజాపతి – ఎలాంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు. 17.గుణసాయి, తూర్పు గోదావరి జిల్లా- స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. 18.శివ (గణేష్ కుమారుడు) – ఎఆంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు. 19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎలాంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు. 20.చారిత్ (వయసు 21), బెంగళూరు -సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు. 21.మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు %-% సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు. 22.తరుణ్ (వయసు 27) %-% బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.
డ్రైవర్ల వివరాలు :
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటన స్థలం నుండి పరారయ్యారు. శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు విచారణ కొనసాగుతోంది.
ప్రయాణికులు రాష్ట్రాలవారీగా:
తెలంగాణ రాష్ట్రం – 6, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- 11, మధ్యప్రదేశ్- 1, కర్ణాటక రాష్ట్రం- 4, మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారనేది తెలియాల్సి ఉంది.





