బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి

కర్నూలు, అక్టోబ‌ర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణకు చెందిన ఆరుగురు మృతిచెందారని, పదిమంది గాయాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. మృతిచెందిన వారికి సీఎం రేవంత్‌ రెడ్డి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ 2013లో పాలెం వద్ద జరిగిన ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు సుశిక్షకులైన డ్రైవర్లను నియమించుకునేలా, రవాణా శాఖ నియమనిబంధనలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మంత్రి వెంట తెలంగాణ జెన్‌కో సీఎండీ హరీష్‌, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య. ఆర్డీవో అలివేలు, ఉండవెల్లి ఎమ్మార్వో ప్రభాకర్‌, తదితరులు ఉన్నారు.

బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు :
1. జె.ఫిలోమిన్‌ బేబీ (64)
2. కిషోర్‌ (64)
3. ప్రశాంత్‌ (32)
4. ఆర్గా బందోపాధ్యాయ (23)
5. యువన్‌ శంకర్‌ రాజా (22)
6. మేఘనాథ్‌ (25)
7. ధాత్రి (27)
8. అమృత్‌ కుమార్‌ (18)
9. చందన మంగ (23)
10. అనూష (22)
11. గిరి రావు (48)
12. కేనుగు దీపక్‌ కుమార్‌ (24)
13. జి..రమేష్‌
14. జి.అనూష
15. మనిత
16. కేశనాథ్‌
17. సంధ్యారాణి
18. కర్రీ శ్రీనివాస రెడ్డి
19. పంచాల శివశంకర్‌ (ద్విచక్ర వాహనదారుడు)
20. పేరు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page