భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను బంధించింది ఈయనే
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధాలో తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) జరిపిన దాడిలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా అనే అధికారి మరణించారు. 2019లో బాలకోట్ దాడిలో భారత వైమానిక దళ అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బంధించింది మేజర్ మోయిజ్ అబ్బాస్ షా. పాకిస్థాన్ సైన్యం కథనం ప్రకారం.. టీటీపీ దాడిలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా, లాన్స్ నాయక్ కూడా మరణించారు. ఖైబర్ పఖ్తున్వాలోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్ సమయంలో ఈ ఇద్దరు సైనికులు మరణించారని పాకిస్థాన్ మీడియా విభాగం తెలిపింది. ఈ ఆపరేషన్‌లో టీటీపీ ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పాకిస్థాన్ సైన్యం కొంతమంది ఉగ్రవాదులను కూడా చంపినట్లు తెలిపింది.