అట్టహాసంగా ‘పద్మ’ పురస్కారాల ప్ర‌దానం

– పలువురికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి 
– కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాల హాజరు

న్యూదిల్లీ, మే 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా వారిలో ఐదుగురు పద్మవిభూషణ్, 13 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు. తొలుత సోమవారం 60 మందికి ఈ పురస్కారాలు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అందచేశారు. . తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాల్ని అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *