వికసిత్ తెలంగాణే మా లక్ష్యం

– నితిన్ పర్యటన చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది
– నగరంలోని మÖడు కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగురుతుంది
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత విస్తరణలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మÖడు రోజుల పర్యటన, పది జిల్లాల పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. ఈనెల 28న హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం నితిన్ శంషాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడినుంచి జిల్లా కార్యాలయంతోపాటు మరో తొమ్మిది జిల్లాల పార్టీ కార్యాలయాల వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజగిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ లెవల్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, బీఎలఏ-2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగరంలోని ముఖ్య నాయకులు, దాదాపు 15వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారని వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న సభా ఏర్పాట్లను రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, ఎంపీ రేఖా శర్మలతో కలిసి రామచందర్‌రావు శనివారం పరిశీలించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నితిన్ నబిన్ గతంలో రాష్ట్రానికి వచ్చినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారని, ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. ఈ సభ ద్వారా నితిన్ నబిన్ రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన రాజకీయ సందేశం ఇవ్వబోతున్నారన్నారు. బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఇప్పటికే తమ నాయకత్వం స్పష్టం చేసిందని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పారని రామచందర్‌రావు వివరించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనే సంకల్ప నినాదం ఈ వేదిక నుంచి ఇస్తామన్నారు. ఇక్కడినుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కొత్త దిశ నిర్ణయిస్తామని చెప్పారు. ఇదే పర్యటనలో వరంగల్‌లో కూడా బూత్‌స్థాయి నాయకులతో సమావేశం, ఘట్‌కేసర్ సమీపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదేనని ఆయన తెలిపారు. ఈ సమావేశాన్ని నితిన్ నబిన్ ప్రారంభిస్తారని, అలాగే యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషించేందుకు వీబీఐటీ కాలేజ్ క్యాంపస్‌లో కాంక్లేవ్ నిర్వహించనున్నట్లు, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని దేశ భవిష్యత్తు, యువత పాత్ర, వికసిత భారత్ లక్ష్యంపై ఆయనతో చర్చించనున్నారని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ వికసిత సంకల్పంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నగరంలోని మూడు కీలక కార్పొరేషన్లలో పార్టీ ఘన విజయాన్ని నమోదు చేస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు కలిసినా కూడా బీజేపీని అడ్డుకోలేవని, ఈ మూడు పార్టీల అసలు స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పునకు ప్రత్యామ్నాయం బీజేపీనేనని రామచందర్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *