– 59 బస్తాలు తడిసాయని రీజినల్ జాయింట్ డైరెక్టర్ నివేదిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, నపవంబర్ 5: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం విచారణ జరిపారు. విచారణలో 7,329 బస్తాల పత్తిలో 59 బస్తాలు తడిసినట్లు తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజున కొనుగోలు చేసినట్లు తేలింది. విచారణ నివేదిక ప్రకారం రైతులకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని తెలుస్తోంది. రీజనల్ జాయింట్ డైరెక్టర్ నివేదికను మార్కెటింగ్ డైరెక్టర్ మంత్రికి సమర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





