ఒక ప్రేమికుడు

ఏ గుట్టకు ఏ పుట్టకు ఏ చెట్టుకు
ఆపదొచ్చినా అతనే పెద్దకొడుకై
ఆగ్రహపు జెండా కర్రయి నిలిచినోడు
హక్కుల గొంతుకలకు
నిర్బంధపు సంకేళ్ళు బిగిసినప్పుడు
నిరసన గళమై నినదించినోడు
కవితల కోకిలను పంజరంలో బంధిస్తే
నాలుగు బాటల కూడలిలో నిరసన పదమై
బిగించిన పిడికిలయి కదం తొక్కినోడు
అక్రమార్కులపై అవినీతి పరులపై
జారుడుబండలెక్కిన దిగజారుడు విలువలపై
ఎక్కుపెట్టిన విలుకాడు
రాలిపడిన పూల కోసం
గాయపడిన పక్షుల కోసం
తల్లడిల్లిపోయే తల్లిమనసు
తండ్లాట పడిన మనిషి కోసం
ఒక దేవులాట!
ఎగ్గలయ్య గుట్టలు పద్మాక్షమ్మ తోటలు
చెట్టుచేమల్లోని పక్షులు పూవులు
అతని రాక కోసం
ఉదయం సాయంత్రాలు
అనాధల్లా ఎదురు చూస్తున్నాయి…
పదండి! మన రాజన్న వస్తడని
మేమున్నామని హామీ ఇద్దాం పదండి!
(నల్లెల్ల రాజయ్యగారి స్మృతిలో…)

-కోడం కుమారస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page