వినూత్నమై అరుదెంచినది
వినిర్మల కాలాది
వినుతింతు నిను యుగాది
।। ఓ విశ్వావసు ।।
పాల్గున మాస వీడ్కోలు
శిశిరఋతువు తరువుల తలలూపు
వసంత ఋతు ఆగమనాలు
చైత్రమాస గండుకోయిలల ఆహ్వానాలు
।। ఓ విశ్వావసు ।।
పూతలే పూవులై విరిసెను
పువ్వులే కాతలై కాపు కాసేను
పులుపు వగరు చేదు ఉప్పు తీపికారాలు
షడ్రుచుల ఉగాది పచ్చడి చేసేను
।। ఓ విశ్వావసు ।।
గ్రహ గతుల గమనాలు
సూర్య – చంద్ర గ్రహణాలు
శుభాశుభముల ముహూర్తాలు
తిథి వార నక్షత్ర యోగాలు
।। ఓ విశ్వావసు ।।
ధనధాన్యాలు ఆదాయ వ్యయాలు
పాలితుల పాలకుల కందాయ ఫలాలు
అవనిపై కలహాలు కల్లోలాలు
ఎరిగించు ఉగాది పంచాంగ పఠణాలు
।। ఓ విశ్వావసు ।।
యుగ యుగాల చరిత గాథలు
ప్రకృతి అందాల వర్ణనలు
కవి పండితుల గోష్టులు సమ్మేళనాలు
ఆమని అందాలు కనువిందులు చేసేను
।। ఓ విశ్వావసు ।।
కాలం పుట్టుక ఆది పండుగ
యుగాది పండుగలకు తొలి పండుగ
పండుగలకు వన్నె తెచ్చు నిండుగ
నూతన వత్సర తెలుగు ఉగాది పండుగ
।। ఓవిశ్వావసు ।।
(2025విశ్వావసు ఉగాది సందర్భంగా)
– పి.బక్కారెడ్డి
905315250





