వోటుకు నోటు కేసు విచారణ వాయిదా

– రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

న్యూదిల్లీ, ఏప్రిల్ 22: వోటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్ సభ్యుడిగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది. మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే, బీఆరఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది. సీఎం రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో వోటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారించాలని కోరారు. ఈ కేసును క్రిమినల్ అవినీతి కేసుగా కాÅ£ ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలని వాదించారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తనపై నమోదైన ఈ కేసులో తన పేరును పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వాదించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *