- ప్రజాక్షేత్రంలో పరువు తీసుకున్నది
– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా
కరీంనగర్,ప్రజాతంత్ర,అక్టోబర్10: బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి వంచించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చింది ఎవరో అర్థం కాలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ అంశం రాజ్యాంగానికి సంబంధించినదన్నారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. దిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియదన్నారు. కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిపించాలని పట్టుబడ్డారు. హా ఇచ్చే ముందు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లోపు పాత సర్పంచ్‌లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు.‘హుజురాబాద్‌లో బీ ఫామ్స్ నేనే ఇస్తా.. ఇక్కడ నేను 25 ఏళ్లుగా లీడర్‌ను.. నేను కాకుండా బీ ఫామ్స్ ఇంకెవరు ఇస్తారు’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





