– ప్రారంభించిన మంత్రి సీతక్క
కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు టీనేజీ బాలికలకు గ్రామగ్రామాన స్నేహ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్‌ను ‘సెర్ప’ నేర్పిస్తున్నది. ఈ క్రమంలో టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం కామారెడ్డిలో ప్రారంభించారు. అలాగే అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మహిళలకు విద్యా బోధనను ‘సెర్ప’ ఏర్పాటు చేసింది. అక్షరాలు, వాక్యాలు చదవడం, రాయడం నేర్పిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది మహిళలకు విద్యాబోధన జరగుతుండగా అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో అక్షరాలు దిద్దించారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



