– ఏటీఎంలా వాడుకుని వదిలేశారు
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు
– కేసీఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి వివేక్
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: గత పదేళ్లలో సింగరేణి సంస్థను కేవలం ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ పాలకులపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కొత్త గనుల కేటాయింపులో బీఆరఎస్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిని గాడిన పెడుతున్నామని, నేరుగా వేలంలో పాల్గొని కొత్త బొగ్గు గనులను దక్కించు కుంటున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమేకాక సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నారని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో డియాతో మాట్లాడిన ఆయన రూ. 60 వేల కోట్ల అప్పుగా ఉన్న తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని వివేక్ విమర్శించారు. ఇందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 మైన్ మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. నాడు సింగరేణికి రావాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలపై నోరు మెదపని కార్మిక సంఘాలు నేడు నెలకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని, అందులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. గతంలో నడ్డా, అమిత్ షా వంటి వారు అవినీతి జరిగిందని ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



