- డ్రగ్స్ ముఠా నుంచి రూ. 3కోట్ల హవాలా డబ్బు పట్టివేత
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్10: రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. నైజీరియా డ్రగ్స్ ముఠా డబ్బు బదిలీ నెట్‌వర్క్‌ను ఛేదించింది. డ్రగ్స్ దందాకు సంబంధించి రూ.3 కోట్ల హవాలా డబ్బును ముంబయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాల డబ్బు బదిలీ చేస్తున్న దగ్గారం ప్రజాపతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు భారత్‌లోకి వొస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ మనీ లాండరింగ్ చేస్తున్న కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ క్వారంటెల్‌కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్‌ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు భారత్‌లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





