– కొరత సృష్టిస్టే కఠిన చర్యలు తప్పవు
– పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టి.. ఇంధనం నిల్వ చేయడం నేరమని హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత కారణంగా దేశ వ్యాప్తంగా ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరోసారి పెట్రోల్ కొరత భయాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, డిమాండ్ కు తగ్గ సప్లై ఉందని అన్నారు. వాహనదారులు భయాందోళనకు గురికావద్దని కోరారు. పలు కారణాలతో కొన్ని బంక్ లు మూసివేసినా సమస్య పరిష్కారం కాగానే ఓపెన్ చేస్తారని కమిషనర్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కొరత కారణంగా సమీప జిల్లాల్లోని బంకులకు వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.