అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎంత హెచ్చు స్థాయిలో ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతగా క్రియాశీలంగా ఉన్నట్టా? చట్టసభల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంతగా బల్లలు పగిలితే, అంతగా కుండలు బద్దలవుతున్నట్టా? రాష్ట్రప్రజల సమస్యలను, అభివృద్ధి అవసరాలను పరిగణనలోనికి తీసుకుని, పరిష్కారాలను అన్వేషిం చడానికి పరస్పరం సంప్రదించుకునే ఉదాత్తత ఉభయ పక్షాలకు ఉండకూడదా? సంక్షేమానికి డబ్బే లేదనుకుందాం, తలపెడుతున్న ప్రాజెక్టులకు పెట్టుబడులే సమకూరలేద నుకుందాం, చివరకు జీతభత్యాలకు కూడా దిక్కులు చూసే పరిస్థితి ఉందనుకుందాం, దాన్ని క్రమానుగత వైఫల్యం గా కాక, అధికారపక్ష వైఫల్యంగా మాత్రమే చూసి, సంకటంలో పెట్టడం కాక, లేక, గత ప్రభుత్వ నేరంగా నెట్టివేయడం కాక, మొత్తం రాష్ట్ర సమస్యగా చూసి ఉమ్మడిగా ఎదుర్కొనడానికి సహాయం కోరకూడదా, చేయకూడదా? అస్తమానం తిట్ల పురాణం కాక, వివిధ అంశాల మీద దృక్పథాల చర్చ ఉండకూడదా? చెన్నై లో డీలిమిటేషన్ మీద చర్చలో అధికార ప్రతిపక్షాలు ఒకే వేదిక పంచుకున్నట్టు, తెలంగాణా కోసం కొన్ని అంశాల మీద పనిచేయ కూడదా? ఏ మాత్రం వాస్తవ దృష్టి లేని, ఊహలో కూడా ఆస్కారం లేని శుష్క ఆదర్శాలు పై ప్రశ్నలలో కనిపించవచ్చు.
కానీ, పరస్పరం తలపడుతున్నామ నుకుంటూ, చేసుకుంటున్న విమర్శలు, మాట్లాడే మాటలు, విసురుకుంటున్న దూషణలు, నోరుజా రుతున్న బూతులు మాత్రం వాస్తవికతను, నిజమైన సైద్ధాంతిక వైరాన్ని సూచిస్తున్నాయా? తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య కనిపిస్తున్న యుద్ధం, వాస్తవవిలువల మీద ఆధారపడ్డదా? ఎదుటివారి మీద చేస్తున్న విమర్శలు ఎవరికి వారికి కూడా వర్తించేవి కావా? ప్రజల అభివృద్ధికి, మనుగడకు ఎంతో ముఖ్యమైన అంశాల గురించి వ్యాఖ్యానించి, పరిపాలన మీద, ప్రజాస్వామిక ఆచరణ మీద విలువైన విమర్శలు చేయవలసిన మీడియా రంగం, ఏ మాత్రం సారం లేని డొల్ల అంశాల మీద, నాయకుల నోటి దుర్గంధం మీద చర్చలు చేయవలసి వస్తున్నది. పనిలో పనిగా, తనలో క్షీణించిపోయిన విలువలను కూడా బయట పెట్టుకుంటున్నది. ఏ రకంగానూ గౌరవనీయ ప్రవర్తనలను చూపలేకపోతున్న నాయకుల నోటి నుంచి, సభ్యతాసభ్యతల గురించి, జర్నలిస్టుల గుర్తింపు గురించి, భావ ప్రకటనాస్వేచ్ఛ గురించి, కడుపు మండిన భాష గురించి ప్రవచనాలు వినవలసి వస్తున్నది. ఎదుటివారి కంటె తాము ఎక్కువ మర్యాదైన, గంభీరమైన ప్రవర్తన కలిగి ఉన్నామని, ఎంతటి రాజీలేని, కఠినమైన విమర్శ చేయవలసి వచ్చినా మాటలలో దిగజారిపోమని నిరూపిం చుకో వడంలో పోటీపడవలసింది పోయి, అసభ్యతలోను, వ్యక్తిగత దూషణల్లోనూ తామే జగజ్జెట్టీల మనిపించుకోవడానికి ఉత్సాహప డుతున్నారు. ప్రత్యర్థి పక్షాన్ని తప్పుపట్టే టప్పుడు నీతులు, తామే తప్పుచేసేటప్పుడు బూ తులు అన్నతరహాలో తెలం గాణ రాష్ట్రం లోని రెండు ప్రధాన పక్షాలు వ్యవహ రిస్తున్నాయి. మూడో పక్షం ఈ రణ రంగంలో లేనట్టు కనిపిస్తున్నా, అది నిశ్శబ్దం గా పరిస్థితిని గమనిస్తూ అదును కోసం వేచిచూస్తున్నది.
సంక్షేమానికి డబ్బే లేదనుకుందాం, తలపెడుతున్న ప్రాజెక్టులకు పెట్టుబడులే సమకూరలేదనుకుందాం, చివరకు జీతభత్యాలకు కూడా దిక్కులు చూసే పరిస్థితి ఉందనుకుందాం, దాన్ని క్రమానుగత వైఫల్యం గా కాక, అధికారపక్ష వైఫల్యంగా మాత్రమే చూసి, సంకటంలో పెట్టడం కాక, లేక, గత ప్రభుత్వ నేరంగా నెట్టివేయడం కాక, మొత్తం రాష్ట్ర సమస్యగా చూసి ఉమ్మడిగా ఎదుర్కొనడానికి సహాయం కోరకూడదా, చేయకూడదా? అస్తమానం తిట్ల పురాణం కాక, వివిధ అంశాల మీద దృక్పథాల చర్చ ఉండకూడదా? చెన్నై లో డీలిమిటేషన్ మీద చర్చలో అధికార ప్రతిపక్షాలు ఒకే వేదిక పంచుకున్నట్టు, తెలంగాణా కోసం కొన్ని అంశాల మీద పనిచేయకూడదా?
అధికారపార్టీ మాటతప్పి నందు కో, కడుపు కొట్టినందుకో ఒక రైతుకో రైతమ్మకో సంక్షేమం మీద ఆధారపడ్డ ఏ పేదకో పేదరాలికో, కట్ట తెగిపోయేంత కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ముం దుకు ఒక కెమెరా వాలు తుంది. బాధితు లకు కడుపుమంటే తెలుసు. వారికి సోషల్ మీడియా గురించి కానీ, మీడియా హద్దులు కానీ, పర్యవసానాలు కానీ తెలి యవు.వీడియో వైరల్ అవుతుంది. అంతే కోపం ఉన్నవారందరికీ అందులోని మాటలు హాయిగా ఉంటాయి. అంత కోపం లేని వారికి ఆశ్చ ర్యంగా ఉం టాయి. ప్రభుత్వ పక్షం మీద ఇష్టం ఉన్నవారికి ఆగ్రహం కలిగిస్తాయి. అది •కారం రంగంలోకి దిగుతుంది. వేకువజామున తలుపు తడుతుంది. మొదట మీడియా ప్రతినిధుల మీద, తరువాత మీడియా చూపించిన మనుషుల మీద విరుచుకు పడుతుంది. నన్నన్ని మాటలు అంటారా అని ఆవేదన పడతారు ముఖ్యమంత్రి. కడుపు మంటను చూడండి, మాటల మంటను కాదు అంటుంది ప్రతిపక్షం. వ్యక్తీకరణకు నియమాలు అక్కరలేదా అంటుంది ప్రభుత్వం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంగతేమిటి అంటు ంది ప్రతిపక్షం. ముఖ్యమంత్రే ప్రతిపక్ష నేత మీద నాలుగు మాటలు తూలతారు. తాగుబోతు అంటారు. మాట జారితే బట్టలు ఊడదీస్తా అంటారు. ఈ సారి ప్రతిపక్షం వంతు. వీడియో బూతులకు వర్తించిన సూక్తులు ఇక్కడ చెల్లవు. అన్ని మాటలు అంటారా అంటుంది. నాక్కూడా రోషం, అభిమానం ఉంటాయి కదా అనకూడదా అంటారు ముఖ్యమంత్రి.ముఖ్యమంత్రి అన్న మాటలనే పత్రికలు పతాకశీర్షికలు చేస్తాయి. ఆయన అంటే మాత్రం అంత హెడింగ్ పెడతారా అని పత్రికల మీద విమర్శ చేస్తుంది ప్రతిపక్షం. మరుసటి రోజు ప్రతిపక్షపత్రిక లో పెద్ద అక్షరాలతో తామే ముఖ్యమంత్రి బట్టలు ఊడదీస్తామని రైతులు అన్నట్టు ఒక శీర్షిక చెలరేగిపోతుంది.
ఎవరు జర్నలిస్టులో తేలుద్దాం రండి అన్నది ఒక సవాల్. మీడియా లోపలికి దూరి రెండు శిబిరాలుగా మోహరించిందెవరో అందరికీ తెలుసు. ఏ గుంపుకు ఆ గుంపు, మీడియాస్వేచ్ఛ గురించి, జర్నలిస్టుల నిర్వచనం గురించి సుదీర్ఘ చర్చలు. ఎదుటివాడి భాషలోని తప్పులు, తమభాషలోని కడుపుమంటలు, ఇవే చర్చల సారాంశం. బహుశా ఒక చట్టం రావచ్చు. ఏ పక్షం అధికారంలో ఉంటే అది ఎదుటి పక్షం మీడియాను కట్టడి చేయడానికి పనికివచ్చే ఒక గట్టి బెత్తం రూపొందవచ్చు. పనిలో పనిగా అదుపు తప్పని మీడియాకు కూడా ఒక లక్ష్మణరేఖ గీయవచ్చు.వర్తమానంలో తన తప్పు ఏమీ లేదని, తనకు సంక్రమించిన బరువులే ప్రభుత్వానికి సంకటాలని రేవంత్ రెడ్డి అంటారు. తమ హయాంలో నడిచింది స్వర్ణయుగమని, ప్రజలు తప్పుచేసి అనుభవిస్తున్నారని బిఆర్‌ఎస్ అంటుంది. ఈ సంవాదంలో తెలంగాణ సమాజానికి ఏమి ఒరిగింది? వర్తమానంలోనూ నష్టం. గతంలోనూ నష్టం. పైగా, తమ రాజకీయ ఎంపిక తప్పుడిదన్న నింద ఒకటి.
రాజకీయాలంటే దుర్భాషా ప్రావీణ్యం అనే నమ్మకాన్ని పక్కనపెడితే, చాలా చేయవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షం. అధికారపక్షంతో సమవుజ్జీగా నిలబడాలన్న తాపత్రయం అన్ని విషయాల్లో పనికిరాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక పరిమితుల మధ్య, ఒత్తిడుల మధ్య పనిచేస్తున్నది. పైగా సత్పరిపాలన అందించి తీరాలన్న పట్టింపు దానికేమీ లేదు. పైవారిని, కిందివారిని, తనవారిని సంతృప్తి పరచాలి. కాబట్టి, అది తరచు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్న సమస్యల వల్ల, సంక్షేమవాగ్దానాలను నెరవేర్చలేదు, దాని వల్ల ప్రజల్లో కలిగే అసంతృప్తిని నిగ్రహించడానికి అణచివేత పద్ధతులను అనుసరించవలసి వస్తుంది. రానున్న వేసవి రాష్ట్రప్రభుత్వానికి పెద్ద సవాల్. పట్టణప్రాంతాల్లో విద్యుత్తు, నీరు సమస్యలు ఎదురయినప్పుడల్లా గతప్రభుత్వాన్ని సానుకూలంగా ప్రస్తావించడం పెరుగుతోంది. ఈ వాతావరణంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజల తరఫున నిలబడి వారి అభిమానాన్నిపొందడానికి ప్రయత్నించాలి. సంచలనాల వల్ల కలిగినంత మైలేజీ కానీ, డ్యామేజీ కానీ ఈ నిర్మాణాత్మక ఆచరణ వల్ల సమకూరకపోవచ్చును కానీ, దీర్ఘకాలంలో రాజకీయ లాభం కలుగుతుంది.
రాజకీయాలంటే దుర్భాషా ప్రావీణ్యం అనే నమ్మకాన్ని పక్కనపెడితే, చాలా చేయవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షం. అధికారపక్షంతో సమవుజ్జీగా నిలబడాలన్న తాపత్రయం అన్ని విషయాల్లో పనికిరాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక పరిమితుల మధ్య, ఒత్తిడుల మధ్య పనిచేస్తున్నది. పైగా సత్పరిపాలన అందించి తీరాలన్న పట్టింపు దానికేమీ లేదు. పైవారిని, కిందివారిని, తనవారిని సంతృప్తి పరచాలి. కాబట్టి, అది తరచు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్న సమస్యల వల్ల, సంక్షేమవాగ్దానాలను నెరవేర్చలేదు, దాని వల్ల ప్రజల్లో కలిగే అసంతృప్తిని నిగ్రహించడానికి అణచివేత పద్ధతులను అనుసరించవలసి వస్తుంది. రానున్న వేసవి రాష్ట్రప్రభుత్వానికి పెద్ద సవాల్. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు, నీరు సమస్యలు ఎదురయి నప్పుడల్లా గతప్రభుత్వాన్ని సానుకూలంగా ప్రస్తావి ంచడం పెరుగుతోంది.
ఈ వాతావరణంలో బాధ్యతా యుత ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజల తరఫున నిలబడి వారి అభిమానాన్నిపొందడానికి ప్రయత్నిం చాలి. సంచలనాల వల్ల కలిగినంత మైలేజీ కానీ, డ్యామేజీ కానీ ఈ నిర్మాణాత్మక ఆచరణ వల్ల సమకూరకపోవచ్చును కానీ, దీర్ఘకాలంలో రాజకీయ లాభం కలుగుతుంది. బిఆర్‌ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ కూడా చేస్తుంది. కాంగ్రెస్ చేసినప్పుడల్లా, బిఆర్‌ఎస్ కూడా చేసిందన్న మాట కూడా వస్తుంది. రానివ్వండి. కొంతకాలం వస్తుంది. తరువాత పోతుంది. ఈ లోగా, బిఆర్‌ఎస్ ప్రజల వైపు నిలబడిందన్న పేరు వస్తుంది. ఎన్ని రోజులు తమ పాలనను సమర్థించుకో వడానికి తీవ్రప్రయత్నం చేస్తూ ఉంటారో అన్ని రోజులు బిఆర్‌ఎస్ ను జనం కొంత దూరమే పెడతారు. ఆ దశను దాటి రావాలి. ప్రతిపక్షం ప్రజలు చేసే ఉద్యమాలకు నైతిక మద్దతో, రాజకీయ సమర్థనో ఇవ్వవచ్చును కానీ, అందులో నుంచి తక్షణ ప్రయో జనం పిండుకో వడానికి దుందు డుకు• •నాన్ని ప్రోత్సహించి, ఉద్యమా శయాలకే చేటు చేసిన సందర్భాలు గడ చిన పదహారునెలల కాలంలో అనేకం కని పిస్తాయి.
కాంగ్రెస్ కొత్త తప్పులు కూడా చేస్తుంది. తెలంగాణ ఉద్యమంతో తనకు దగ్గరి సంబంధం లేకపోవడం వల్ల అట్లా చేస్తారో లేక వ్యతిరేకత ఏదైనా ఉందో కానీ, తెలంగాణ సమాజం మనోభావాలను ఖాతరు చేయని విధంగా రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి టర్నినల్ కు పెట్టాలన్నసూచన వెనుక, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టే రాజకీయం ఉందా లేక, అనాలోచితమా తెలియదు. తెలంగాణ వైశ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటే, మరో విధంగా కూడా ఆయన వ్యవహరించవచ్చు. నిజాం వ్యతిరేక పోరాటానికి తొలి అడుగులు వర్తక, వైశ్య సమాజం నుంచే పడ్డాయని, ఆనాటి ఉద్యమంలో గణనీయమైన సంఖ్యలో ఆ సామాజిక వర్గం నుంచి పాల్గొన్నారని రేవంత్ రెడ్డికి ఎవరైనా చెబితే బాగుండు.
కాంగ్రెస్ కొత్త తప్పులు కూడా చేస్తుంది. తెలంగాణ ఉద్యమంతో తనకు దగ్గరి సంబంధం లేకపోవడం వల్ల అట్లా చేస్తారో లేక వ్యతిరేకత ఏదైనా ఉందో కానీ, తెలంగాణ సమాజం మనోభావాలను ఖాతరు చేయని విధంగా రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి టర్నినల్ కు పెట్టాలన్నసూచన వెనుక, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టే రాజకీయం ఉందా లేక, అనాలో చితమా తెలియదు. తెలంగాణ వైశ్యుల మనోభా వాలను పరిగణనలోకి తీసుకుంటే, మరో విధంగా కూడా ఆయన వ్యవహరించవచ్చు. నిజాం వ్యతిరేక పోరాటానికి తొలి అడుగులు వర్తక, వైశ్య సమాజం నుంచే పడ్డాయని, ఆనాటి ఉద్యమంలో గణనీయమైన సంఖ్యలో ఆసామాజిక వర్గం నుంచి పాల్గొన్నారని రేవంత్ రెడ్డికి ఎవరైనా చెబితే బాగుండు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షలు, నిషేధాజ్ఞల వెనుక ఉద్దేశ్యమేమిటో తెలియదు. కెసిఆర్ ఉస్మానియా విషయంలో ఎంతటి వైమనస్యాన్ని ప్రదర్శించారో తెలిసిందే. తాను అందుకు భిన్నంగా ఉండే అవకాశాన్నిరేవంత్‌రెడ్డి కోల్పోతున్నారు. అటువంటి సలహాలు ఆయనకు ఎవరు ఇస్తున్నారో, వారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థి లోకమంతా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేస్తుంది. ప్రజాస్వామిక పాలన అంటూ ఇచ్చిన ఏడోహామీకి ఇది బాహాటపు ఉల్లంఘన. అనేక వాస్తవ సమస్యలు ఉండగా, తాము బూతులు తిట్టీ, విడియోలలో జనం చేత తిట్టించీ రాజకీయాలను వేడిగా ఉంచాలనుకోవడం ఏమి చాపల్యం? దురదృష్టవశాత్తూ, ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది సంవత్సరాలుగా కలుషితమైన రాజకీయ సంవాద వాతావరణాన్ని తెలంగాణకు కూడా దిగుమతి చేసు కోవడం అవసరమా? తెలంగాణ సమాజం ఈ విషయంలో మరింత పరిపక్వతను చూపి, అసభ్యతను కుసంస్కారాన్ని అనుమతించబోమని చెప్పవద్దా? ఎవరు జర్నలిస్టులు అన్నసందేహం సరే, ఎవరీ కుసంస్కార రాజకీయులు అన్న ప్రశ్న మాత్రం రావద్దా?