– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సన్నద్ధం
– 8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
– ఇప్పటికే ఐదు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుతుండడంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సచివాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో శుక్రవారంఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగినందున అదే స్థాయిలో ముందెన్నడూ లేని రీతిలో ఈ రబీ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలుకు గాను రాష్ట్రవ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇప్పటికే 5,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 20 జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని,సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదన్నారు.క్షేత్రస్థాయి నుండి వస్తున్న సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానుందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఇప్పటి వరకు నాలుగు లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 12 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచేందుకు వీలుగా గోదాములు గుర్తించామని, మరో 20 లక్షల బాయిల్డ్ రైస్‌ను నిల్వ ఉంచేందుకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిపినట్లు, కొనుగోలు కేంద్రాలలో 16 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమను త్వరితగతిన కొలిచేందుకు వీలుగా ప్యాడి క్లినర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఎక్కడా ఆలస్యం జరగకుండా చూసేందుకు సరిపడ హమాలీలను నియమించాలన్నారు. తూకం ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా ప్రాంతంలో ఉన్న మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యాం తరలి రాకుండా ఉండేలా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘాను తీవ్రతరం చేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి అయ్యే మొత్తాలను రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా పౌర సరఫరాల శాU మార్కెటింగ్ శాఖలతోపాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాU కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ డిప్యూటీ కమిషనర్ కొండల్ రావు, జనరల్ మేనేజర్ ధాన్యం కొనుగోళ్లు, ఫైనాన్స్, మార్కెటింగ్ లతోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




