రాష్ట్రంలో కొత్త పార్టీ

– తెలంగాణా రాష్ట్ర సేనగా నామకరణం
– జెండా, ఎజెండాను ప్రకటించిన కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ’తెలంగాణ రాష్ట్ర సేన’గా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉన్నమూడు పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. బీఆరఎస్ పదేళ్ల అవినీతి, కాంగ్రెస్ మోసం, బీజేపీ చేతగానితనం కారణంగా తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు తప్పలేదన్నారు. ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడడమే ఎజెండగా ఐదు ప్రధాన హామీలతో పాంచజన్యం పూరించారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదన్నారు. తాను తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామన్నారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్క్నతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమే.. ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని కవిత అన్నారు. రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని.. ఒక రాజకీయ నేతను అలా అనకూడదు కానీ అనాల్సి వస్తున్నదని అన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం మాట్లాడట్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. అందుకే కర్కోటకుడని అంటున్నామన్నారు. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం.. రెండేళ్ల తర్వాత మనదే అధికారం అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *