అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం

– ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు
– 27న రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష
– తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆరఎస్ పాలనలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న అసత్య ఆరోపణలను లెక్కచేయకుండా పేదవాడే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. భూములకు సంబంధించిన సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పొంగులేటి తెలిపారు. వచ్చే 50 రోజుల్లో సాదాబైనామా అంశాల్లో న్యాయమైన సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. , అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇదిలావుండగా ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ, హసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నుండి క్షేత్రస్థాయి సక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఈ సమావేశాలను దశలవారీగా నిర్వహించనున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి, కేటాయింపు, మౌలిక వసతుల కల్పన వంటి విషయాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక త్వరలో రెండవ విడత ఇళ్ల మంజూరుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ,తాజాగా అమలు చేస్తున్న భూధార్, సర్వే మ్యాప్‌ల వంటి కీలక రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అలాగే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా హౌసింగ్ అధికారులు కూడా పాల్గొననున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *