నవీన్‌ ‌యాదవ్‌ ‌వైపే మొగ్గు

~ అధిష్టానానికి పేరు సిఫారసు 
~ పోటీ నుంచి తప్పుకున్న బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబరు 07: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ ‌యాదవ్‌కి లైన్‌ ‌క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో మంగళవారం జూమ్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్‌ ‌యాదవ్‌ ‌వైపు సీఎం రేవంత్‌ ‌రెడ్డి మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్‌ ‌ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌నిర్ణయిస్తుందని బొంతు రామ్మోహన్‌ ‌తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలుపు కోసం తాను పనిచేస్తానని ఆయ‌న ప్రకటించారు. మరోవైపు.. జూమ్‌ ‌సమావేశంలో కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చేసిన సర్వే రిపోర్టులు, అభ్యర్థుల సామాజిక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే, రెండు పేర్లతో ఏఐసీసీకి సిఫారసు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page