గాయం సూదిమొనై
అస్తిత్వాన్ని గుచ్చి
నొప్పిని మొద్దుబారుస్తుంది
బరువెక్కిన గుండె
ఖాళీ చెయ్యమనీ
తూట్లు పొడవబడిన
మెదడుతో మొరపెట్టుకొని
ఇంకిపోతుంది
ఎక్కడో పాతిబెట్టబడ్డ
ధైర్యం రెక్కలు-
ఆశకు అపనమ్మకానికి
అంటుకడతాయి
భయం- కన్నీళ్ళు తుడుచుకొని
జీవితాన్ని మరోసారి
అసంబద్ధతకు తాకట్టుపెడుతుంది
మొత్తానికి మనిషి
నైరాశ్యపు కాళ్ళపై లేచేసరికి
ఇంకో ద్రోహపు ఫలితాల
నిరీక్షణలో తోయబడి
బ్రతుకు చోద్యం చూస్తుంది!
– రఘు వగ్గు