నీలిరంగు సముద్రం
నేల అందాలను చూడాలనుకుంది
పుట్టుకనుండి ఇప్పటి దాక
పోరు చేస్తునే ఉంది
మనిషి ఆకలి అంతును
చూడాలను కున్నట్లు
కడలి అలలు లేచి లేచి పడి
పరుగెడు తున్నాయి
చెలియల కట్ట దాటాలని
మనిషి హృదయం మనసు
తీరని కోరికల కై తపిస్తున్నట్లు
ఉదధి తనలోని బడబానలం
దాచుకుని తనకు తాను శీతలంగా
మనిషి తనలోని ఉదరాగ్ని
ఆకలితో చల్ల పరుచుకుంటూ
జలధి ఎన్నోమురికి ప్రవాహాలను
శుధ్ధి చేసుకుంటు బాధలనురుగులతో
మనిషి అంతులేని అవినీతిని భరిస్తు
నవ్వులను మరిచి పోయీ
మంచు విప్లవం వస్తే
నేల సౌందర్యాలను తనివి తీర
తాకి తరించాలనుకుంటుంది అంబుధి
మనిషి మనిషిగా జీవించే
కలల సామ్యవాదం ఫలిస్తే
విశ్వాని పూలతోటలా
దర్శించ గలనంటు మనిషి
రేడియమ్
9291527757