దేవుడు ఎక్కడో ఉండి విశ్వమంత
వీక్షించినట్లు
శ్రీకృష్ణుడు విశ్వ దర్శనం చేయించినట్లు
మనిషి కలగని చూసి సంభాషించినట్లు
మనిషి మాయ లాంతరు మంత్రదండం
అంజనం అన్నట్లు
చూపుతుంది టెలివిజన్ ఉన్నది ఉన్నట్లు
ప్రత్యక్ష పరోక్ష దూర దృశ్య శ్రవణ దర్శిని
చెంతనే దర్శింపజేయు దూరదర్శిని
సంస్కృతి సంప్రదాయాల వాడుక
ఆధునిక ప్రజాభిప్రాయ వేదిక
ఆకాశవాణికి తోబుట్టువులు
ఆధునిక టీవీ గాడ్జెట్లు సెల్ ఫోన్
స్కానింగ్ మిషన్ లు
జె యల్ బైర్డ్ టెలివిజన్ పిత
పెట్టించే ఇంటింటా టీవీ
పట్టించే సెల్ఫోన్ అందరి చేత!
విజ్ఞాన సాంకేతిక శ్రమ ఫలాలు
విశ్వ మానవుడు సమకూర్చుకున్న సదుపాయాలు
లోకేషన్ తో లోకమంతా చుట్టి వస్తున్నాడు
విశ్వంలో పరిణామాలను చూస్తున్నాడు
క్రికెటే కాదు అసెంబ్లీ నుంచి అంతరిక్షం వరకు
అన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు
నాటి తోలుబొమ్మలాటలు వీధి భాగవతములు
నేటి టీవీ సినిమాలు సీరియళ్లు వార్తలు
గ్రహ గతులను పరిశీలిస్తున్న మానవుడు
విచక్షణతో ముందు జాగ్రత్త పడుచున్నాడు
జరగబోయే జరుగుచున్న ప్రకృతి విపత్తులను పసిగడుతున్నాడు
నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు
ఆధునిక మానవుని జీవితంలో టీవీ
భాగమై కూర్చున్నది
అందుకే పెరిగింది మనిషి ఠీవీ
(నవంబర్ 21, అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవం)
– పి.బక్కారెడ్డి
9705315250