-కేసు రుజువైతే 15 ఏళ్ల జైలు ఖరారు
వాషింగ్టన్, అక్టోబర్ 24: భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. మూన్‌లైటింగ్ చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. న్యూయార్క్ వాసి అయిన గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాడు. ఇది అతడి ప్రాథమిక ఉద్యోగం. ఈ సమయంలో అతడు మాల్టాలోని గ్లోబల్‌ఫౌండ్రీస్ సెకండక్టర్ కంపెనీలో కాంట్రాక్టర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. 2022 నుంచి అతడు ఇందులో కాంట్రాక్టర్‌గా ఉన్నాడు. ఇ మెయిల్‌ల ఆధారంగా గోస్వామి మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర నిధుల్లోంచి దాదాపు రూ.44 లక్షలు దొంగతనం కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాల్సిన సమయంలోనే ప్రైవేటు కంపెనీ కోసం పనిచేస్తుండటంతో అక్టోబరు 15న అధికారులు అతడిని అరెస్టు చేశారు. నిజాయతీగా సేవ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. గోస్వామి దాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడు. రాష్ట్రం కోసం పనిచేస్తున్నా అని చెప్పుకుంటూ మరో కంపెనీ కోసం పూర్తి సమయం కేటాయించాడు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బుతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమేనని ఇన్‌స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ పేర్కొన్నారు. ఇటీవల అధికారులు గోస్వామిని కోర్టులో హాజరుపరచగా అతడు బెయిల్ లేకుండానే విడుదలయ్యాడు. అయితే కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇందులో నేరం రుజువైతే అతడికి 15 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఇక, గోస్వామి అరెస్టు నేపథ్యంలో మూన్‌లైటింగ్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





