– కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన పార్కు వద్ద ఆగి లోపలికి వెళ్లారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా పార్కు నిర్మాణం చేపట్టాలని గతంలో జీహెచ్‌ఎంసీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్కును ఆకస్మికంగా పరిశీలించారు. పార్కులో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి పనులకు సంబంధించిన వివరాలతోపాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





