పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న మోదీ

– అయోధ్య‌ ‌విరాళాలపై ప్రకటన చేయాల్సిందే
– కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి తీవ్ర విమర్శలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 4: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి డిమాండ్‌ ‌చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. వీటిపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దిల్లీలో ఆయ‌న‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక పార్లమెంట్‌ అని, ఒక్కరోజు కూడా పార్లమెంట్‌ ‌పనిచేయకుండా వాయిదాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ‌మోదీ ప్రభుత్వానికి ఒక ఆట స్థలంగా మారిందని ధ్వజమెత్తారు. సభలో ఏ మాత్రం చర్చలేకుండా బిల్లులు ఆమోదించుకుంటున్నారని రవి ఆగ్రహించారు. పార్లమెంట్‌ ‌నడవకపోగా వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన నియోజకవర్గంలో కమలం పార్టీ అభ్యర్ధి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని, హోం మంత్రి, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించనందునే బీజేపీకి వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఒకటి మాత్రమే గెలిచిందని రవి అన్నారు. బీజేపీ త్వరలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పెల్లెట్‌ ‌గన్స్ ‌ప్రయోగించారని మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా సభలో వివరణ ఇవ్వాలని రవి డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *