కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం

  • తెలంగాణలో రుణమాఫీ చేయలేక పోతోంది
  • కర్నాటకలో వినాయకుడిని జీపెక్కించారు
  • టుక్డే..టుక్డే గ్యాంగ్‌ ‌కాంగ్రెస్‌ను నడిపిస్తోంది
  •  మహారాష్ట్ర వార్దాలో మోదీ ఘాటు విమర్శలు

కాంగ్రెస్‌ అం‌టేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హా ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు.  మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ ‌రాజకుటుంబమే అని ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు.అర్బన్‌ ‌నక్సల్స్, ‌తుక్డే తుక్డే గ్యాంగ్‌ ‌కాంగ్రెస్‌ను నడిపిస్తోందని దుయ్యబట్టారు.

ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్‌ ‌కాదని, ఆ పార్టీలో దేశభక్తి, స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని మోదీ పునరుద్ఘాటించారు. నేటి కాంగ్రెస్‌ ‌గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్‌ ‌తిలక్‌ ‌నాయకత్వంలో దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన  అందరికీ తెలుసు.

ప్రజలు పూజించిన దేవుని విగ్రహాన్ని పోలీసు వ్యాన్‌లో బంధించారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు కూడా మౌనంగా ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఏకమై కాంగ్రెస్‌ ‌చేస్తున్న పాపాలకు తగిన బుద్ధి చెప్పాలని మోదీ అన్నారు. నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయి, ద్వేషం అనే దెయ్యం ప్రవేశించిందని మోదీ దుయ్యబట్టారు. కర్ణాటక, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భరతమాతను, దేశ సంస్క•తిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *