– బీసీ న్యాయవాదుల జేఏసీ పిలుపు
నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ కుల సంఘాల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ బాధ్యులు జెనిగల రాములు, గిరి లింగయ్య గౌడ్‌లు విజ్ఞప్తి చేశారు. బంద్‌కు సంబంధించిన పోస్టర్ ను బీసీ అడ్వకేట్స్ జేఏసీ అధ్వర్యంలో నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఒక ప్రజాస్వామ్యబద్ధమైన సూత్రమని, రిజర్వేషన్ల లక్ష్యం సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడమేనని అన్నారు. రిజర్వేషన్లు సమాన అవకాశాలకు మినహాయింపు కాదని, సమాన అవకాశాలకు ఒక సాధనమని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నదన్నారు. 42% బి.సీ రిజర్వేషన్ల పెంపు దిశగా వివిధ రూపాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి స్పష్టమైన కార్యాచరణతో ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.జవహర్‌లాల్, నేతి రఘుపతి, ఎండి నజీరుద్దీన్, వేములకొండ సత్తయ్య, లింగంపల్లి సురేష్, జలేందర్, పజ్జురి స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





