షరతులతో కూడిన బెయిట్ మంజూరు
హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 21: క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపు కేసులో వర్గాల అరెస్టయిన బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసుగానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్ప్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని లీగల్ టీం వాదించింది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యేను హన్మకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యేపై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదయింది. మరోవైపు అక్రమంగా గ్రానైట్ క్వారీని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం అంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచే ముందు వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. హాస్పిటల్‌లోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20శాతం కషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం..‘ అని వ్యాఖ్యానించారు.
షరతులతోకూడిన బెయిల్ మంజూరు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్‌ను కాజీపేట రైల్వేకోర్టు తిరస్కరించింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. . అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ముందు రిమాండ్ విధించి.. ఆ తర్వాత రూ.25వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అరెస్టు దుర్మార్గం : మాజీ మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండ : శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని శనివారం కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా కేటీర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, అందుకే వారిపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం దివాలా తీసి మొత్తం అవినీతిమయమైపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికలు జరపనందున గ్రామాలకు వొచ్చే నిధులు ఆగిపోయాయన్నారు. రుణమాఫీ సగం చేసి మొత్తం చేశామని మోసం చేస్తున్నారన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో రేవంత్ రెడ్డి లాంటి దరిద్రపు పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నాయకత్వం సరిగా లేకనే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందని తెలిపారు.