- మీ చరిత్ర తెలుసుకున్న ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ, జూన్ 15: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలకు నేడు మేము శుద్ధి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Nayini Rajender Reddy ) మాట్లాడారు. కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా రూ.50 కోట్ల నిధులను విడుదల చేశారు. భద్రకాళి అమ్మవారికి అన్ని చేశామని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు మీ హయాంలో భద్రకాళి అమ్మవారికి ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా…? అని సవాల్ విసిరారు. కేటిఆర్ నయీంనగర్ బ్రిడ్జి మీద వరద బాధితులకు ఇస్తానన్న రూ.10 వేలు ఎక్కడ అని ప్రశ్నించారు. జైలుకు పోయే ముందు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. అమరవీరుల ఆత్మ క్షోభిస్తూన్నాయి. నిజమైన ఉద్యమకారులు నేడు మా ప్రజా ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగిందని మా పార్టీలోకి వస్తున్నారు. అభివృద్ధికి వేసిన ప్రతి టెండర్ ప్రక్రియ తెరచిన పుస్తకమే.. ముఖ్యమంత్రిని విమర్శించడమే తప్ప ప్రజలకు మీ హయాంలో చేసిన అభివృద్ధి ఎంటో చెప్పలేదు. మేము కక్ష సాధింపు చర్యలకు దిగితే మీరు మీ నాయకులు బయట తిరగలేరు.. మీ చరిత్ర ఎంటో ప్రజలకు తెలిసి మిమ్మల్ని పక్కన పెట్టారు. గుండు సున్నాలతో ఎంపీ ఎన్నికల్లో ప్రజలు పక్కనపెట్టిన మేలు బుద్ధి రాలేదు. నా కుటుంబ నేపథ్యం గురించి ప్రజలకు తెలుసు.
నాడు వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను వత్తాసు పలకడం సిగ్గుచేటు. మేము ఉరికిచ్చికుంటే కొడితే జిలాల్లో ఒక్కరూ ఉండరు. చెరువు అభివృద్ధిలో ఆన్లైన్ ద్వారా ఈ- టెండర్ విధానం ద్వారానే ఎంపిక జరిగింది. అర్హత కలిగిన వారికే టెండర్లు ఖరారు అవుతాయనే కనీస అవగాహన లేదు. భద్రకాళి అమ్మవారి చెరువు మట్టి తరలింపులో పూర్తిస్థాయి ఉచితంగా అందుబాటులోని రైతులకు, శ్మశాన వాటికలకు అందజేస్తున్నాం. వరంగల్ అభివృద్ధిలో మీ పాత్ర ఏంటో కేటిఆర్ నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా!! భద్రకాళి చెరువు గతంలో ఉన్న విస్తీర్ణంతో పనులు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి స్థాన చలనం జరగలేదు. గతంలో చెరువులో ఉన్న చిన్న చిన్న గుట్టల ప్రాంతాలల్లో మట్టి పోసి ఐలాండ్ లాగా మారుస్తున్నాం.మీ 10 పదేళ్ల హయాంలో బొంది వాగు పట్టించుకోకపోతే సుమారు 160 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. భద్రకాళి అమ్మవారి ముక్కు పుడుక నుంచి ప్రతి వస్తువుపై చిత్త శుద్ధితో ఉన్నాం.. వడ్డేపల్లి రైతులను భూములను లాక్కోవాలని చేసిన నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే హక్కు లేదు అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.