– మంత్రి దుద్దిళ్ల సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ఐటీ, పరిశ్రవపులు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారని, రెండు పర్యాయాలు హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేశారని వెల్లడిరచారు. ఎన్‌ఎస్‌ఎస్ వార్తా సంస్థను స్థాపించి మీడియా రంగానికి విశేష సేవలందించారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. నిబద్ధతతో పనిచేసిన లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





