– పాల్గొననున్న 100 కంపెనీలు
– సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఆహ్వానం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : హుజూర్‌నగర్, కోదాడతో కలిపి సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలోనీ తన క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో వంద కంపెనీలు పాల్గొనబోతున్నాయని వివరించారు. పదవ తరగతి నుండి ఇంజినీరింగ్ వరకు పూర్తి చేసిన యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఐటి, ఫార్మా, ఇ-కామర్స్, ట్రేడ్, మాన్యుఫాక్చరింగ్, ఐటిఇఎస్, బి.పి.ఓ, బయోటెక్నాలజీ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





