– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడులక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆయన ఎందుకు వీఆర్‌ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వం జవాబు చెప్పాలని ఒక ప్రకటనలో నిలదీశారు. మంత్రుల ఒత్తిడికి లొంగకపోతే వాళ్లని బలి చేస్తారా,. మీ స్వార్థం కోసం అధికారులను వేధిస్తారా అని లక్ష్మణ్ ఘాటుగా విమర్శించారు. ఇంకా విచారణ పేరుతో సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధించడం తగదని హితవు పలికారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను ఆయన నిలదీశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





