సామాజిక న్యాయానికి అద్దం పడుతోంది..

ఇది వంద శాతం  వాస్తవిక బడ్జెట్
అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్
బడ్జెట్ పై మంత్రి సీతక్క వ్యాఖ్యలు

సబ్బండ వర్ణాల  సమగ్ర అభివృద్ధి, సామాన్యుల సంక్షేమం, సామాజిక న్యాయానికి అద్దం పట్టేలా తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.  సాంఘిక సంక్షేమం తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధిక నిధులు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను  మంత్రి సీతక్క  ప్రత్యేకంగా కలిసి బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. దిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోదన్నారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆరేనని విమర్శించారు. కేసీఆర్ మూటలు తీసుకున్న వారంతా ఆగమయ్యారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం.

బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్.. అందుకే ప్రజలు వాతలు పెట్టారు. ఇది బిఆర్ఎస్  మాదిరి ఆహో ఓహో భజన బడ్జెట్ కాదు.. మహిళా ,రైతు ,యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్ ఇది.  వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉంది. సాంఘిక, సంక్షేమ శాఖ తర్వాత పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి కి అధిక నిధులు కేటాయించాం. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల నిధులు కేటాయించాం. మహిళా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నిధుల కేటాయింపు జరిగింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక అవకాశాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్ ఇది. 100% మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశలో మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేలా ఈ బడ్జెట్ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page