మహిళా సంఘాలకు గుడ్​న్యూస్​

  • వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు
  • ఈ ఏడాది మహిళా సంఘాల వడ్డీ కోసం రూ. 2,500 కోట్లు
  • 2026-27 వార్షిక రుణ ప్రణాళిక రూ. 26,621 కోట్లు..
  • వడ్డీ వ్యాపారుల దోపిడీకి చెక్ పెడతాం : మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 7 : మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రకటించారు. మహిళా సం ఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాం కు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. జ్యో తిబాపూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన మహి ళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27 ఆవిష్కరణ కార్యక్రమం లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొ న్నా రు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, ప్రముఖ బ్యాంకర్లు, అధికారు లు, జిల్లా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ. 26,621.47 కోట్ల రుణ సదుపాయం కల్పిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్ల డించారు. గత 2025–26లో మహిళా సంఘాలకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 40 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుం టే, 60 వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి నట్లు వెల్లడించారు. ఇదంతా మహిళా సంఘా లు బ్యాంకర్ల సహకారంతోనే సాధ్యమైంది అని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంట కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం కేంద్రా లను మహిళా సంఘాలకు అప్పగించాం” అని తెలిపారు. గతంలో మహిళలకు చిన్న మొ త్తాల రుణాలు కూడా లభించని పరిస్థితి ఉండే దని, ఇప్పుడు లక్షల రూపాయల రుణాలు బ్యాంకులు నమ్మకంతో ఇస్తున్నాయని చెప్పా రు. మహిళా సంఘాలు రుణాల రీపేమెంట్‌లో అద్భుతమైన క్రమశిక్షణ చూపిస్తున్నాయని, ఎస్‌హెచ్‌జీల ఎన్పీఏ కేవలం 1.40 శాతంగా ఉండటం మహిళల ఆర్థిక బాధ్యతకు నిదర్శనమని అన్నారు. నిర్మల్ జిల్లా జీరో ఎన్‌పీఏ సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు 100 శాతం రీపేమెంట్ సాధించాలని పిలుపునిచ్చారు.

వడ్డీ వ్యాపారుల దోపిడీ నీ చూడలేక తాను నక్సలైట్లలో చేరానని గుర్తు చేశారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలిపిస్తూ వడ్డీ వ్యాపారుల దోపిడిని అడ్డుకుంటున్నామని తెలిపారు. “బ్యాంకులకు మేమే గ్యారెంటీ ఇస్తు న్నాం. మహిళా సంఘాలకు రుణాలు ఇస్తే మీ డబ్బులకు పూర్తి భద్రత ఉంటుంది. వ్యక్తులకు ఇచ్చిన రుణాలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది. కానీ మహిళా శక్తి నమ్మకాన్ని నిలబెడు తుంది” అని మంత్రి పేర్కొన్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మ హిళలను ఉద్యోగార్ధుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. క్యాంటీన్లు, బస్సులు, పాడి కేంద్రా లు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, మహిళా మార్టులు, గోదాములు వంటి రం గాల్లో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజల అభి వృద్ధి కోసం కాంక్షించే స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన త్వరలోనే సా ధ్యపడుతుందని ఆకాంక్షించారు. కార్యక్ర మంలో మహిళా సంఘాల సభ్యులు మంత్రి సీతక్క ప్రకటనలను చప్పట్లతో స్వాగతిం చారు. అనంతరం రుణాల పంపిణీ, రీపేమెం ట్‌లో ప్రతిభ కనబరిచిన జిల్లా డీఆర్డీఓలు, జిల్లా సమాఖ్య అధ్యక్షులను మంత్రి సీతక్క సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *