నల్గొండ, ప్రజాతంత్ర, మే 28 : బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇది అని అన్నారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. బక్రీద్ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదని, ఇది మానవాళికి ఒక గొప్ప జీవన సందేశమని పేర్కొన్నారు. అన్నివర్గాలు, అన్ని మతాల ప్రజలు సమానమేనని, అందరూ కలిసిమెలిసి ఉండాలనే గొప్ప సందేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పారు. నల్గొండలో మతసామరస్యానికి, గంగా`జమున- తెహజీబ్‌కు నిలువెత్తు సాక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




