బిఎల్‌వోలను బెదిరిస్తున్న ఎంఐఎం

– సిఈవోకు ఫిర్యాదు చేసిన  బీజేపీ నేతలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7:  సర్‌ ‌పక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను  బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు కోరారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆ పార్టీ బృందం కలిసింది. ఈ సందర్భంగా సర్‌ ‌విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని రాంచందర్‌ ‌రావు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ చీఫ్ ‌మీడియాతో మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లకుండా బీఎల్‌ఓలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పలువురు వోటర్లకు ఫారాలు అందడం లేదని రాంచందర్‌ ‌రావు తెలిపారు. తెలుగు ఫారాలతో ఇతర రాష్ట్రాల వోటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హైదరాబాదే కాకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు ఫారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. వోటర్ల జాబితా లోపాలపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు రాంచందర్‌రావు పేర్కొన్నారు.ఈ బృందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, సీనియర్ నాయకులు ఆంథోని రెడ్డి, సోల్కర్ తదితరులు ఉన్నారు

జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠమే లక్ష్యం కావాలి

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రతి కార్యకర్త విజయమే ఏకైక లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పాలనకు విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పార్టీకి బలమైన కేడర్, ప్రజల ఆదరణ ఉన్నాయని, ఈ జిల్లాలో విజయం సాధించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ద్వితీయ, తృతీయ స్థానాల గురించి కాక కేవలం విజయాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయని, అందరికీ భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, అవినీతిపై బూత్, మండల స్థాయి నుంచి బలమైన ఉద్యమాలను నిర్మించాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా స్థానిక సమస్యలను గుర్తించి నిరంతర పోరాటాలు చేయాలన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సైబరాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరేది కాషాయ జెండానే అని అన్నారు. తాను ఎంపీగా గెలిచిన తరువాత ఎల్బీనగర్ నియోజకవర్గం కార్పొరేటర్లకు రూ.కోట్ల నిధులు వచ్చాయని, ఇక్కడి కార్పొరేటర్లు తమ వంటి వారి అవసరం లేకుండానే ప్రజల పనులు చేసిపెట్టగల సత్తా సంతరించుకున్నారని తెలిపారు. మాటల గారడి చేసి గెలిచిన రేవంత్ రెడ్డి రెండేళ్లకే వెలకిల పడ్డాడని ఎద్దేవా చేశారు. ఈ పార్టీ మళ్లీ గెలవదు అని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులే అంటున్నారని, దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నాయకుడు పార్టీకి భారం కాకూడదు. కార్యకర్తలు, ప్రజలే మన వీఐపీలు. మొన్న మమ్మల్ని గెలిపించారు.. నేడు మిమ్ముల్ని గెలిపించడంలో మా శాయశక్తులా కృషి చేస్తాం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జాతీయ నాయకుడు పేరాల శేఖర్ జీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు ప్రభా గౌడ్, రవికుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నుకుల పద్మారెడ్డి, బండారు శైలజ, శ్రీదేవి రెడ్డి, కాలేం రవీందర్, కొత్త రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండారు భాస్కర్, యశ్‌పాల్ గౌడ్, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు గుండె కిరణ్ కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు నవంజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రంగా నర్సింహ గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *