నిరుద్యోగ నిర్మూలనకు దృఢ సంకల్పం

– ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం సంస్థల్లో ఉపాధి కల్పన
– మారుమూల ప్రాంతంలో మెగా జాబ్‌ మేలా ఇదే ప్రప్రధమం
– నిరుద్యోగుల నుండి భారీ స్పందన
– 40 వేల మందికిపైగా అభ్యర్థుల నమోదు
– గోండుగూడెం, దళితవాడల, బీసీ బస్తీల నిరుపేదల కోసమే..
– మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ యువతకు ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి కల్పించేందుకు ముందెన్నడూ లేని రీతిలో ప్రప్రథమంగా మారుమూల ప్రాంతం హుజూర్‌నగర్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ, సింగరేణి కాలరీస్‌ సహకారంతో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్‌లో శనివారం ఉదయం ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు తరలిరాగా అదే స్థాయిలో 275 పరిశ్రమలు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు తరలి రావడం శుభపరిణామమని అన్నారు. 40 వేల పైచిలుకు అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పెరిగిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రెండో రోజు కూడా కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. సమాజానికి సవాల్‌గా మారిన నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సాంథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 70 వేల నుండి 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. తాజాగా గ్రూప్‌-1,గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ కుడా అందులో భాగమేనన్నారు. గోండు గూడెంలో, దళితవాడల్లో, బీసీ బస్తీల్లో ఉన్న నిరుపేదలతోపాటు మైనారిటీ, ఈబీసీల కళ్ళలో వెలుగులు నింపాలన్న సదుద్దేశంతో ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చుట్టామన్నారు. స్థానిక పరిశ్రమలతోపాటు జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశ్రమలతో తానే స్వయంగా సంప్రదించి జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు అంగీకరింప చేశామన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని, అనుకున్న ఫలితాలు సాధిస్తే మరోసారి కోదాడ కేంద్రంగా మరో మెగా జాబ్‌ మేళా ఏర్పాటు చేస్తామని ఉత్తవమ్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, ఖమ్మం కమిషనర్‌ సునీల్‌దత్‌ లతోపాటు డీఈఈటీ డైరెక్టర్‌ రాజేశ్వర్‌ రెడ్డి, అడిషనల్‌ కార్పొరేట్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ వంశీధర్‌ రెడ్డి, సింగరేణి కాలరీస్‌ ప్రతినిధి చంద్ర తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page