యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్‌లో యాదగిరిగుట్ట పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పిలుపు మేరకు యాదగిరిగుట్ట ఏసిపి బీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా పెద్ద సంఖ్యలో దాతలు వచ్చి రక్తదానం చేశారు. యాదాద్రి భువనగిరి జోన్ డిసీపి అక్షాంశ్ యాదవ్ రక్తదానం చేసి శిబిరంను ప్రారంభించారు. కార్యక్రమంలో యాదాద్రి డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ యాదగిరిగుట్ట టౌన్ సీఐ.బి భాస్కర్. రూరల్ సీఐ శంకర్ గౌడ్ ఆలేరు ఇన్స్పెక్టర్ , రాజపేట, తుర్కపల్లి, మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వోలు, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





