ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టే చర్యలు

– ఐడీపీఐసీని ఏర్పాటు చేశామన్న ఆర్థిక మంత్రి

న్యూదిల్లీ, జూలై 28: దేశంలో ఆన్‌లైన్‌ ‌మోసాలను అరికట్టేందుకు ’ఇండియా డిజిటల్‌ ‌పేమెంట్‌ ఇం‌టెలిజెన్స్ ‌కార్పొరేషన్‌ (ఐడీపీఐసీ)’ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఏఐ వంటి సాంకేతికతను ఉపయోగించి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అలర్ట్ ‌చేసేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. సైబర్‌ ‌మోసాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పెరుగుతున్న సైబర్‌ ‌ముప్పులను ఎదుర్కొనేందుకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నాం. రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా తో సంప్రదించి ఐడీపీఐసీని ఏర్పాటు చేశాం. కృత్రిమ మేధ, మెషిన్‌ ‌లెర్నింగ్‌, ‌బిగ్‌ ‌డేటా అనలిటిక్స్ ‌వంటి అత్యాధునిక సాంకేతికతల సహాయంతో మోసాలను వెంటనే గుర్తించి సంబంధిత విభాగాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మెటాడేటా స్థాయిలో సైబర్‌ ‌సెక్యూరిటీ ముప్పులను గుర్తించేందుకు జాతీయ సైబర్‌ ‌సమన్వయ కేంద్రాన్ని ఇండియన్‌ ‌కంప్యూటర్‌ ఎమ్జ్గ•న్సీ రెస్పాన్స్ ‌టీమ్‌ ఏర్పాటు చేసింది. అదేవిధంగా సెర్ట్-ఇన్‌ ‌పర్యవేక్షణలోనే ఆర్థిక రంగానికీ ఓ నోడల్‌  ‌ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేశాం. ఇవి ఎప్పటికప్పుడు భాగస్వామ్యపక్షాలతో సమాచారాన్ని పంచుకుంటాయి. తద్వారా సకాలంలో చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *