దోమ కాటుకు
మలేరియా డెంగ్యూ
కుక్క కాటుకు
రేబీస్ మెదడు వాపు
పాము కాటుకు
శ్మశాన దారి
చీమ కాటుకు
చీమే చిత్తడి
మనిషి కాటుకు
మనిషే చితుకు…
మానవ జీవన యానం లో
కాటులు పోటులు వేటులు
తప్పవు రావని చెప్పలేము
తగ్గవురాచపుండు బాధలు…
అల్లోపతి హోమియోపతి టెలిపతి
నేచరోపతి యునాని ఆయర్వేదోపతి
ఆసుపత్రి గీతాలు ఆలపించిన
దేవుళ్ల భజన పాటలు తప్పవు
నమ్మకాల గుడుల చుట్టు తిరుగక తప్పదు
ఆ సుడి గడి నుండి బయటకు రాలేడు
జ్ఞాన అజ్ఞానల తో చరిస్తాడు తరిస్తాడు…
అన్ని కాటుల కన్న
మనిషి కాటు కాలకూట విషం
మందు మాకు కు రోగం కుదురదు
ఆసుపత్రులు లేనే లేవు
సమాజ నరమాంస భక్షకులు
వాళ్ల ధనజాతి కోరలకు బలి పశువులు
వాళ్ల కాటుకు జరబద్రం…
ఎంత విన్నను గాని
ఎంత చూసిన గాని
ఎంత జ్ఞానమున్న ను గాని
మనిషి మనిషి కాలేడు
మారితే ఋషి కాగలడు
మనీషి గా మనగలడు
రేడియమ్
9291527757