ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అర్థరాత్రి మమత

కోల్ కతా, మే 1: కోల్ కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు. అనుక్షణం ఆమె కదలికను తమ ఏజెంట్ గమినిస్తూ వచ్చినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ లో మమతా బెనర్జీ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఆయన శు క్రవారం షేర్ చేశారు. ‘ఔట్ గోయింగ్ సీఎం ఎంత ప్రయత్నించినా నిబంధనలు ఉల్లంఘించకుండా మేము అడ్డుకున్నాం అని సువేందు పేర్కొన్నారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *