– గడ్చిరోలిలో సీఎం సమక్షంలో ఆయుధాల అప్పగింత
– లొంగిపోయిన 61మందికి రివార్డులు అందజేత
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మావోయిస్టు అగ్రనేత (పొలిట్‌బ్యూరో సభ్యుడు) మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బుధవారం అధికారికంగా లొంగిపోయారు. ఈయనతోపాటు 60మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీస్ శాఖ అధికారికంగా గడ్చిరోలిలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సభలో మల్లోజుల వేణుగోపాల్ అధికారికంగా లొంగిపోయారు. వేణుగోపాల్ సహా 61 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. వీరందరూ 54 ఆయుధాలను ముఖ్యమంత్రికి అందజేశారు. వేణుగోపాల్ తన సహచరులతో లొంగిపోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ముఖ్యమంత్రి అభినందించారు. అగ్ర నేత వేణుగోపాల్‌తోపాటు వివిధ స్థాయిలలో ఉన్న మావోయిస్టులకు రివార్డులను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఇకపై రాజ్యాంగపరంగా పనిచేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేవిధంగా చర్యలు ఉండవని, అందరితో కలిసికట్టుగా జనజీవన స్రవంతిలో ఉంటానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





