రూ.21 వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి

– సన్న వడ్లకు రూ. 500 బోనస్
– ధాన్యం డబ్బులు నేరుగా ఖాతాల్లోకి
– గోదాముల సామర్థ్యాన్ని 200 శాతం పెంచుతాం
– మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నాచేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగో లు కేం ద్రాన్ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైతు లు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమా నికి పెద్దపీట వేసిం దన్నారు. సన్న వడ్లకు మ ద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని ప్రకటిం చారు. పంటను విక్రయించి న వెంటనే, వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని వివ రించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో పేదలకు ఇచ్చిన ప్రతి మాటను ప్ర భుత్వం నెరవేరుస్తోందని పొంగులేటి స్పష్టం చేశారు. గత పాలకులు ఐదేళ్లలో చేయలేని రుణమాఫీని, తమ ప్రభుత్వం కేవ లం ఆరు నెలల్లోనే రూ. 21 వేల కోట్లు విడు దల చేసి 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసిందని గుర్తు చేశారు. గతంలో రైతు బంధు కింద రూ. 10 వేలు అందిస్తే, ప్రస్తుతం రైతు భరోసా ద్వారా రూ. 12 వేలు అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటను భద్రపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రంలో గోదాముల సామర్థ్యాన్ని 200 శాతం మేర పెంచేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల జారీ వంటి అనేక సంక్షేమ పథకాలను అప్పుల భారం ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇల్లందు మున్సిపాలిటీ  అభివృద్ధికి రూ.50 కోట్లు

భద్రాచలం/ఇల్లందు, ప్రజాతంత్ర, ఏప్రిల్  22 :  ఇల్లందు మున్సిపాలిటీ పరిధి లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవా రం విస్తృతంగా పర్యటించారు. ఈ సంద ర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనక య్య, కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రా హుల్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు లు తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజ లు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహా లను ప్రారంభించారు. అనంతరం ఇల్లం దు మున్సిపల్ కార్యాలయంలో నూతనం గా ఏర్పాటు  చేసిన చైర్‌పర్సన్ గది ప్రారంభించి, చైర్‌పర్సన్ కిరణ్ మిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇల్లందు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని అన్నారు . ఇల్లందు అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.   ఎమ్మ‌ల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 200 నుంచి 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారున్నారు. కొత్తగా వార్డు కౌన్సిలర్లు ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖ ఫీడింగ్ రవీందర్ నాథ్, తాసిల్దార్ ఎంపీడీవో ధన్సింగ్,మున్సిపల్ వైస్ చైర్మన్ రాజు  పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *