భూ పరిపాలనలో మరో ముందడుగు

– ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
– 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: గ్రామ రెవెన్యూ వ్యవస్ధ బలోపేతానికి గ్రామ పాలనాధికారు(జీపీవో)లను అందుబాటులోకి తేగా తాజాగా సులభంగా భూ సేవలందేలా ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌, సర్వే విభాగం కమిుషనర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంత్‌తో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన సర్వేయర్లకు ఈనెల 19న శిల్ప కళా వేదికలో లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో భూమి సర్వే మ్యాప్‌ను జతపరచడం తప్పనిసరి చేసిన నేపథó్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 350మంది సర్వేయర్లు సరిపోరని, మరికొందరు అవసరమవుతారని మంత్రి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్‌ పోస్టుల భర్తీ, ఇంకోవైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునికి పరికరాలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడానికి దరఖాస్తులను ఆహ్వానించగా పదివేల మంది దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చామని, ఇందులో 3465 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. రెండో విడతలో మరో మూడువేల మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణను ప్రారంభించామని, ఈనెల 26న జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజులపాటు అప్రెంటిస్‌ ఉంటుందని, వీరి సేవలు కూడా డిసెంబర్‌ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడిరచారు. రెవెన్యూ శాఖకు సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉంటుందని, భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే వివాదాలు తగ్గుతాయని, సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లబిస్తాయని అన్నారు. గత పదేళ్లుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్రస్దాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలకు తగిన సేవలు అందలేదని గుర్తుచేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు.. ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page