– కారుపై పడడంతో 13 మంది దుర్మరణం
సిమ్లా, జూలై 24: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా గిరిజన ప్రాంతం పాంగిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిలాడ్-ఉదయ్‌పూర్ రహదారిపై కడు నాలా సమీపంలో వెళ్తున్న టాటా సుమో వాహనంపై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా మట్టితో వాహనం పూర్తిగా కూరుకుపోవడంతో అక్కడికక్కడే 13 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు భర్మౌర్-పాంగా ఎమ్మెల్యే డాక్టర్ జనక్ రాజ్ ధ్రువీకరించారు. ఘటన అనంతరం జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాల నేపథ్యంలో పర్వత ప్రాంతాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




