హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, డియేషన్ సెంటర్ ఐఏఎంసీకు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. ఐఏఎంసీ భూకేటాయింపుతో పాటు, ప్రస్తుత భవనం నిర్వహణ కోసం జారీ చేసిన జీ.ఓ.లను కూడా హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీ.ఓ.ను హైకోర్టు కొట్టేసింది. ఐఏఎంసీకి భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాది కె.రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై జనవరిలో వాదనలు ముగిశాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థకు భూకేయింపు చేశారని న్యాయవాది రఘునాథ్ రావు కోర్టుకు తెలిపారు. ఐటీ కారిడార్‌లో రూ.350 కోట్ల విలువ చేసే భూమిని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేటాయించారని వాదించారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, డియేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వివాదాలు కేవలం న్యాయస్థానాల్లో నే కాకుండా.. బయట కూడా పరిష్కరించుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నా యన్నారు. ఐఏఎంసీ వల్ల వివాదాలు పరిష్కారమైతే కోర్టులపై కూడా భారం తగ్గుతుందన్నారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో జనవరిలో తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు శుక్రవారం వెలువరించింది.