రిజర్వేషన్లపై ప్రభుత్వానికి దక్కని ఊరట

– స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీం తిరస్కరణ
– అవ‌స‌ర‌మైతే పాత ప‌ద్ధ‌తిలోనే ఎన్నిక‌ల‌కు వెళ్లండి
– హైకోర్టు విచారణపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
– 50శాతం మించి రిజర్వేషన్లను ఆమోదించలేమని వ్యాఖ్య
– ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ

న్యూదిల్లీ, అక్టోబర్‌ 16(ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెం డింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని, మెరిట్స్‌ ప్రకారం విచారించాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై ఈనెల 9న హైకోర్టు విధించిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈనెల 13న ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ముందు మెన్షన్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే రిజిస్ట్రీ ఈ కేసును గురువారం విచారణ జాబితాలో చేర్చింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఫ్వీు వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, మూడు నెలలు దాటినా బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయని, కృష్ణమూర్తి జడ్జిమెంట్‌ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ప్రతివాది లాయర్‌ వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో పెండిరగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. కాగా, కేబినెట్‌ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page